పరకాయప్రవేశం అంటే ఏమిటి ?
పరకాయప్రవేశం ఒక ప్రాచీనమైన కళ. ఈ కళ తెలిసిన వ్యక్తి మరణించిన జంతువుల లేదా మనుషుల శరీరం (కాయం) లోనికి ప్రవేశించి ఆ జీవు యొక్క శరీరంతో కొన్ని పనులు చేసి అవసరం తీరిన తరువాత తిరిగి ఆ శరీరాన్ని వదలి తన శరీరంలోని ప్రవేశించవచ్చును.
అయితే అంతవరకు వదలిన తన శరీరం జాగ్రత్తగా భద్రపరచవలసిన అవసరం ఉన్నది. లేనియెడల పరకాయప్రవేశం చేసిన శరీరంతోనే సంచరించాల్సి ఉంటుంది. పరుల శరీరంలో ప్రవేశించే విద్య కాబట్టి పర కాయ ప్రవేశం అని పేరువచ్చినది.