Type Anything.., You Get World Wide Search Results Here. !

రెండు చెంచాల ఉప్పూ, గ్లాసు నీళ్లూ ఉంటే చాలు ఏడు గంటల పాటు విద్యుత్‌...?

రెండు చెంచాల ఉప్పూ, గ్లాసు నీళ్లూ ఉంటే చాలు ఏడు గంటల పాటు విద్యుత్‌...?

రెండు చెంచాల ఉప్పూ, గ్లాసు నీళ్లూ ఉంటే చాలు ఏడు గంటల పాటు విద్యుత్‌ వెలుగులకి ఏ లోటూ ఉండదు. 'భలే ఉందే ఈ ఆవిష్కరణ' అనిపిస్తోందా, నిజమే! మొత్తం ఏడువేల దీవుల సముదాయమైన ఫిలిప్పీన్స్‌లో ప్రజలు ఆర్థికంగా వెనుకబాటుని ఎదుర్కొంటున్నారు.
పెద్దగా ఆదాయ వనరుల్లేని వారికి ఉన్న ఆస్తి అంటే.. పుష్కలమైన సముద్ర నీళ్లు మాత్రమే. అక్కడ నివసించే చాలామందికి విద్యుత్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొనే స్థోమత లేదు. ఇప్పటి వరకూ వాళ్లు కొవ్వొత్తులూ, బ్యాటరీతో వెలిగే దీపాలు ఉపయోగించే వారు. దాంతో చాలాసార్లు ఇళ్లు అగ్నికి ఆహుతి అవడం, లేదంటే బోలెడు డబ్బు ఖర్చవడం జరిగేది. ఇటువంటి వారి జీవితాల్లో విద్యుత్‌ వెలుగులు తీసుకురావాలనుకొంది ఎయిసా మిజెనా అనే మహిళా ఇంజినీర్‌. 

గ్రీన్‌పీస్‌ ఫిలిప్పీన్స్‌ బృందంలో సభ్యురాలైన ఆమె, కేవలం ఉప్పు నీళ్లతో నడిచే దీపాన్ని కనిపెట్టింది. ఈ దీపాలు పూర్తిగా పర్యావరణహితమైనవి. వీటితో ఎటువంటి ప్రమాదాలు జరగవు. ప్రపంచంలోనే పర్యావరణ విపత్తుల్ని ఎదుర్కొనే మూడో దేశంగా పేరొందిన ఫిలిప్పీన్స్‌కి విద్యుత్తు అవసరం చాలా ఉంది. విద్యుత్‌ తీగలతో సంబంధం లేని ఈ దీపాలు ఇప్పుడక్కడ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

Top

Bottom