Type Anything.., You Get World Wide Search Results Here. !

Titan submarine: టైటాన్‌ జలాంతర్గామి అన్వేషణ విషాదాంతం.. ఐదుగురు మృతి..

Titan submarine: టైటాన్‌ జలాంతర్గామి అన్వేషణ విషాదాంతం.. ఐదుగురు మృతి..

నడిసంద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను చూసేందుకు వెళ్లిన.. టైటాన్ జలాంతర్గామి కథ విషాథాంతం అయ్యింది. అందులో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల గాలింపునకు తెర దించుతూ.. ఓషన్ గేట్ సంస్థ ఈ దుర్ఘటనపై అధికారిక ప్రకటన చేసింది.

నడిసంద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను చూసేందుకు వెళ్లిన.. టైటాన్ జలాంతర్గామి కథ విషాథాంతం అయ్యింది. అందులో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల గాలింపునకు తెర దించుతూ.. ఓషన్ గేట్ సంస్థ ఈ దుర్ఘటనపై అధికారిక ప్రకటన చేసింది. సముద్రంలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా టైటాన్ సబ్‌మెరైన్ పేలిందని, దాంతో అందులోని వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. 1912లో సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులు మినీ జలాంతర్గామిలో వెళ్లారు. ఆదివారం వీరు వెళ్లగా.. మూడు రోజుల క్రితం సముద్రంలో టైటాన్ గల్లంతైంది. ఈ టైటాన్ కోసం గాలింపు చేపట్టగా.. ఒత్తిడి కారణంగా పేలిపోయినట్లు గుర్తించారు.

అయితే, టైటాన్‌ దుర్ఘటనలో పాకిస్తాన్ బిలియనీర్ షెహజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటీష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ నేవీ అధికారి పాల్ హెన్నీ, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ ప్రాణాలు కోల్పోయారు.

ఓషన్ గేట్ సంస్థపై క్రిమినల్ కేసు..?
ఈ దుర్ఘటన నేపథ్యంలో ఓషన్ గేట్ సంస్థపై క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు యూఎస్ అధికారులు. ఈ ప్రయాణం ప్రమాదకరమని తెలిసీ.. వారు విస్మరించారని, భద్రతా ప్రోటోకాల్‌ పాటించకపోవడం, రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోకపోవడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునే ఆస్కారం ఉందని అంటున్నారు.

Top

Bottom