Type Anything.., You Get World Wide Search Results Here. !

జ్ఞాపకశక్తి అంటే ఏమిటి?

జ్ఞాపకశక్తి అంటే ఏమిటి?

నేర్చుకున్న విషయాన్ని గుర్తుంచుకోవడమనేది జ్ఞాపకశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ శక్తి ఉంటే నేర్చుకున్న విషయాలు మెదడులో పదిలమై ఉంటాయి. 
mind power కోసం చిత్ర ఫలితం
నిత్యజీవితంలో జరిగే సంఘటనలను మనం ఎలా గుర్తుంచుకుంటామనేదానికి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటిది, మనం ఏదన్నా నేర్చుకున్నా లేదా అనుభవించినా మన దేహంలోని నాడులు స్పందిస్తాయి. ఈ నాడీ స్పందనలు మెదడులోని న్యూరోనుల మీద తమ ప్రభావం చూపుతాయి. 
mind power కోసం చిత్ర ఫలితం
ఈ విధంగా మెదడు సంఘటనలను పదిలపరుస్తుంది. రెండో సిద్ధాంతం ప్రకారం నేర్చుకునేటప్పుడు మెదడు మీద శాశ్వతమైన మార్పులు వస్తాయి. అవి జ్ఞాపకశక్తి రూపంలో అలాగే నిలిచిపోతాయి.

మెదడులో ఉన్న న్యూక్లిక్‌ ఆమ్లం ఆర్‌. ఎన్‌. ఎ సంఘటనలను పదిలపరుస్తుందంటారు కొందరు జంతు శాస్త్రజ్ఞులు. మూడేళ్ళ నుండి నలభై ఏళ్ళ వయస్సు వరకూ న్యూరోన్లలో ఉన్న ఆర్‌. ఎన్‌. ఎ పరిమాణం పెరుగుతూ ఉంటుందని తెలుసుకున్నారు. 

ఈ కాలంలో మనిషి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. న్యూరోన్లలో ఉన్న ఆర్‌. ఎన్‌. ఎ పరిమాణం 40 నుండి 55-60 ఏళ్ళ వయస్సు వరకూ స్థిరంగా ఉంటుంది. అంచేత మనిషి జ్ఞాపకశక్తిలో పెద్దగా మార్పులు ఉండవు. ఆ తర్వాత ఆర్‌. ఎన్‌. ఎ బలహానపడి, జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. 

ఏ విషయాన్ని అయినా గుర్తుంచుకోవడానికి, మళ్ళీ మళ్ళీ చదివితే లేదా చేస్తేనే ఆ విషయం మనస్సులో స్థిరపడుతుంది. దీనినే జ్ఞాపకం ఉంచుకోవడం అని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు.

Top

Bottom